మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి


గల గల గోదారి కదలిపోతుంటేను
బిరబిరా క్రిష్ణమ్మ కదలి పోతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక


రుద్రమ్మ భుజశక్తి,మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!


-- శంకరంబాడి సుందరాచారి.

1 comments:

guru said...

Hello,
Posting nice article and information ... go ahead.